ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): జడ్పీహెచ్ఎస్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ ని అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ స్కూల్ రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావుని అదేవిధంగా మునగాల మోడల్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న జాకీర్ హుస్సేన్ ని వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత అటువంటి ఉన్నతమైన స్థానాన్ని గురువులకు ఇవ్వడం ఎంతో ఆనందించదగ్గ విషయమని అన్నారు. చేస్తున్న వృత్తిలో నిబద్ధతగా నిస్వార్ధంగా పనిచేసి విద్యార్థుల యొక్క భావితరానికి బాసటగా నిలవాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు.



