గంగకు చేరిన గోపిరెడ్డి నగర్ గణనాథుడు….
భారీ ఊరేగింపులతో గోపిరెడ్డి నగర్ గణేష్ నిమజ్జనం….
డప్పు చప్పుళ్ళు… యువత చిందులు… కోలాటాలతో కోలాహలంగా గణేష్ నిమజ్జనం….
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద నిమజ్జనం సందర్భంగా శుక్రవారం స్థానికులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గోపిరెడ్డి నగర్ లో వీధుల్లో శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది యువకుల నృత్యాలు డప్పు చప్పుళ్ళు బాణాసంచా మహిళల కోలాటాలతో వినాయక నిమజ్జన ఊరేగింపు కోలాహలంగా మారింది వందలాదిమంది భక్తులు నిమజ్జనంలో పాల్గొని ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు.

అనంతరం పట్టణంలోని ప్రధాన వీధి గుండా కమిటీ సభ్యులందరూ కలిసి గణనాథుని గంగకు చేర్చారు ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు రెడ్డి మల్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు రావెళ్ల కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి బాడిషా రామారావు, కమిటీ సభ్యులు ఎర్రసాని మహేష్ రెడ్డి పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి అంబురి వెంకటరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం వెంకట్ రెడ్డి, గాయం బ్రహ్మానంద రెడ్డి, పింగళి వెంకటేశ్వర్ రెడ్డి, యర్ర సాని వెంకటరెడ్డి, పరిపూర్ణ చారి తదితరులు భక్తులు పెద్దలు పాల్గొన్నారు.



