రక్తదానం మహాదానం
:రక్తదానం చేయండి ప్రాణదాతలు నిలవండి
:యునైటెడ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో రక్తదానం.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్): రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి ఆ రక్తదానం మహాదానం అని యునైటెడ్ ముస్లిం యూత్ సభ్యులు అన్నారు. యూత్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీని ఆదివారం కోదాడ పట్టణంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకొని తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో
100 మంది పాల్గొనగా ఖమ్మంలోని నోవా కేర్ బ్లడ్ బ్యాంకు కు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లి జన్మనిస్తుందని రక్తదాత పునర్జన్మను ఇస్తాడన్నారు. మానవ రక్తాన్ని ప్రత్యానమయంగా రక్త ఉత్పత్తి చేయలేమని రక్తదాతలే ప్రాణదాతలు అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ముస్లిం యూత్ నాయకులు, పట్టణ ప్రముఖులు
తదితరులు పాల్గొన్నారు.



