శ్వాస ధ్యాస బడి పైనే
:ఉపాధ్యాయుడు,సమాజ శిల్పి
: టీచర్ బడుగుల సైదులు
కోదాడ, సెప్టెంబర్ 07(మనం న్యూస్): జననం, బాల్యం 04 మే 1967న సూర్యాపేట జిల్లా చింత్రియాల గ్రామంలో కోటయ్య (లేట్), సూరమ్మ దంపతులకు జన్మించిన బడుగుల సైదులు చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకున్నారు. విద్యను ఆయుధంగా చేసుకుని సమాజంలో మార్పు తేవాలనే సంకల్పం అప్పటినుంచే ఆయనలో నాటుకుపోయింది.
విద్యాభ్యాసం
ప్రాథమిక విద్యను స్వగ్రామమైన చింత్రియాలలో పూర్తిచేసుకుని, దొండపాడు హైస్కూల్ (హాస్టల్) లో చదివారు.తర్వాత కేఆర్ఆర్ కళాశాల, కోదాడలో కాలేజ్ విద్య పూర్తి చేశారు. ఆర్థికశాస్త్రంపై మక్కువతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో మాస్టర్ డిగ్రీ, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం నల్గొండ డైట్ కళాశాలలో శిక్షణ పొందారు.ఇంటర్మీడియేట్ చదువుతూనే (1962) ట్యూషన్లు చెప్పడం ద్వారా బోధనకు శ్రీకారం చుట్టారు.ఇంటర్మీడియేట్ చదువుతూనే (1962) ట్యూషన్లు చెప్పడం ద్వారా బోధనకు శ్రీకారం చుట్టారు.
ఉద్యోగ ప్రస్థానం
అర్ధశాస్త్ర ఉపాధ్యాయుడిగా ప్రారంభమైంది ఆయన బోధనా
అదే సంవత్సరంలో విశ్వభారతి పాఠశాల ఇవి రెడ్డి కళాశాలల స్థాపకుడిగా ఎకనామిక్స్ లెక్చరర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.1989-2000 ఈవి రెడ్డి డిగ్రీ కళాశాలలో ఫ్రెన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తించారు.2000లో ఉషోదయ ప్రైవేట్ పాఠశాలలను స్థాపించారు. ఎస్వి డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్ గా 2010 నవంబర్ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అంకితభావంతో బోధిస్తూ. నిద్యారంగంలో విశేషు సేవలందిస్తున్నాడు. దానికి గుర్తింపుగా డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో… ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి.. బెస్ట్ టీచర్ అవార్డు, సెప్టెంబర్ 8 సోమవారం నాడు సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అవార్డును అందుకుంటున్నాడు.



