కబడ్డీ క్రీడాకారులకు జిల్లా అసోసియేషన్ ప్రోత్సాహం…
:యువ ప్రో కబడ్డీ క్రీడా కారులకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఘనంగా అభినందనలు.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్): గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ ను వెలుగులోకి తెచ్చేందుకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కృషి చేస్తుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అద్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి, నామా నరసింహారావులు అన్నారు. ఆదివారం కోదాడ లో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం లో మాట్లాడారు. కబడ్డీ క్రీడలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.అనంతరం యువ ప్రో కబడ్డీ లో పాల్గొన్న జిల్లా క్రీడాకారులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్ కర్తయ్య క్రీస్టాఫర్ బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, వేనేపల్లి శ్రీనివాస్ రావు, పందిరి నాగిరెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రామకోటి, మంగయ్య, వెంకట్ రెడ్డి, కోటయ్య, తిరుపయ్య, పాల్గొన్నారు.



