భారతనాట్యంలో 12 ప్రపంచ రికార్డులు అందుకున్న శ్రీ తన్వి నటరాజ్ డ్యాన్స్ విద్యార్థులు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): కాశి విశ్వేశురుడు కి రావణాకృత శివతాండవం నృత్యం డిసెంబర్ 8 2024 న నిర్వహించడం జరిగింద. ఈ ప్రదర్శనతో భారతనాట్యంలో ఒక్కొక్కరు 12 ప్రపంచ రికార్డులు 15 మంది నాట్య విద్యార్థులు సాదించినారు.వరల్డ్ రికార్డ్స్ కమిటీ నుండి సర్టిఫికెట్స్ పంపించడం జరిగింది. ఈరోజు అనగా శుక్రవారం నాట్య గురు తిరుపతి స్వామి శ్రీ తన్వీ నటరాజ్ డ్యాన్స్ స్కూల్ లో విద్యార్థుల కు సర్టిఫికెట్స్ అందజేశారు. ఇన్ని ప్రపంచ రికార్డులు ఇంతమంది విద్యార్థులు సాధించడం ఇదే మొదటి సారి అని ఇది మన పట్టణానికి ఎంతో గర్వ కారణం అని తల్లి తండ్రులు వారి ఆనందాన్ని తెలియజేస్తూ భరతనాట్యంలో ఇన్ని ప్రపంచ రికార్డులు సాధించే విధంగా తమ పిల్లలను తయారుచేసిన నాట్య గురువు తిరుపతి స్వామి కి కృతజ్ఞతలు తెలియజేశారు. 12 ప్రపంచ రికార్డులు సాధించిన నాట్య విద్యార్థులు. శ్రీ ఆధ్య, నాగనిత్యశ్రీ, యువానషా, తపస్య,ద్యుతి, హాసిని డా,శిరీష,సాన్విక, శ్లోక, కుసుమశ్రీ,శ్రేష్ఠ,లౌక్య, జెనిలా, సాన్వికరావు,హృతిక లకు అందించినట్లు తెలిపారు.



