పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించాలి….
:బడిలో వన మహోత్సవం…
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఎంఈఓ ఎండి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు. ప్రతి విద్యార్థి బడిలో ఇంటిలో మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారానే మానవ మనుగడ అని తెలిపినారు. పాఠశాల గ్రీనరీ అభివృద్ధి కోసం మున్సిపాలిటీ శాఖ పూర్తి గా సహకరిస్తుందని తెలిపినారు. పాఠశాలలో బడి తోట, ఔషధ మొక్కల పార్కును సందర్శించి విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి మార్కండేయ ఉపాధ్యాయులు కోదాడ మున్సిపాలిటీ వనమహోత్సవ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



