ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం (బాబు) పాల్గొని తెలంగాణ ఆవిర్భావం గురించి మాట్లాడుతూ ప్రజా పాలన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఒక కార్యక్రమం. ప్రజా పాలన అంటే ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ప్రభుత్వ సేవలను అందించడం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం, దీని ద్వారా ప్రజలు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోవచ్చు అని అన్నారు. ప్రజా పాలన అనేది తెలంగాణలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ఒక పథకం.ప్రజల వద్దకే ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి వారి అవసరాలను తెలుసుకుని, ప్రభుత్వ సేవలు అందించేలా రూపొందించబడిందని అన్నారు.

ప్రజలు ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు ఫారాలను సమర్పించవచ్చు. ఈ ఫారాల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి, అర్హులైన వారికి సేవలను అందిస్తారు. 2023 డిసెంబర్ 28న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పెండం వెంకటేశ్వర్లు, గంధం యాదగిరి, ఖాజా గౌడ్, షాబుద్దీన్, తిప్పిరిశెట్టి రాజు, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, కర్రి సుబ్బారావు, పాశం శ్రీను, యేసయ్య, బాగ్దాద్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



