వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
Mbmtelugunews// కోదాడ, సెప్టెంబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకొని ప్రజాసేవలు వారికి నేరుగా అందే విధంగా రూపొందించిన కార్యక్రమమే ప్రజాపాలన ఆనీ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్ బషీర్, గ్రేడ్ వన్ సెలక్షన్ సెక్రటరీ రాహుల్, తమ్మనబోయిన వీరబాబు, మల్లు వెంకటరెడ్డి, కోటయ్య, చింతకుంట్ల సూర్యం, మనెమ్మ, శ్రీనివాస్, నర్సిరెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



