కబడ్డీ బాలికల కోచింగ్ క్యాంప్
Mbmtelugunews// కోదాడ, సెప్టెంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో
శ్రీ వైష్ణవి స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో సూర్యాపేట జిల్లా సబ్ జూనియర్స్ బాలికల కోచింగ్ క్యాంప్ ప్రారంభం. శ్రీ వైష్ణవి స్కూల్ నందు సూర్యాపేట జిల్లా బాలికల కబడ్డీ కోచింగ్ క్యాంప్ ను సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాతీయ క్రీడాకారులు నామా నరసింహారావు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నిజాంబాద్ జిల్లాలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలు జరగనున్నాయని ఈ పోటీలకు సంబంధించి జిల్లా జట్టు 25 మంది బాలికలను క్యాంపు సెలెక్ట్ చెయ్యడం జరిగింది అని ఈ రోజు నుండి 24వ తేదీ వరకు క్యాంపు ఉంటుందన్నారు ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అంతేకాకుండా క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని సూర్యాపేట జిల్లా కబడ్డీ క్రీడాకారులకు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో విజయం సాధించి జిల్లా కు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శెట్టి రామచంద్ర రావు, వైష్ణవి విద్యాసంస్థల చైర్మన్ లక్ష్మణరావు, కోశాధికారి సైదులు, జాయింట్ సెక్రెటరీ బసవయ్య, రమేష్ బాబు, పిటి ఉదయ్ కుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.



