బతుకమ్మ ఆట-పాట తెలంగాణ సంస్కృతి…
టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్): బతుకమ్మ ఆటపాట తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని గోపిరెడ్డి నగర్ లో శనివారం జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి మొదటి ప్రాధాన్యతగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు.

ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. ప్రతి మహిళ బతుకమ్మ స్ఫూర్తితో తమ లక్ష్యాలను చేరుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, న్యాయవాది కొండల్ రెడ్డి, వీరారెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వర్లు వెంకటరెడ్డి, రామారావు, సాయి కృష్ణమాచారి, రవీందర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, చింతకుంట్ల మంగమణి, బెంగళూరు హైకోర్టు అడ్వకేట్ పద్మ, లలితా దేవి, లింగమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.



