నవ్వుల జల్లు వేణుమాధవ్ జయంతి వేడుకలు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్): తెర సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో నవ్వులరేడు, సినీ హాస్యనటులు, నంది అవార్డు గ్రహీత వేణుమాధవ్ జయంతి వేడుకలను తెర కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. తెర సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… తన చేష్టల ద్వారా, హావభావాల చేత హాస్యాన్ని పలికిస్తూ విద్యార్థి దశ నుండే అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరినీ రంజింపజేశారు. రంగస్థలంపై, అలాగే సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన మిమిక్రీ కళ చేత రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చి కళాప్రీయుల చేత శభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా సింహాద్రి, లక్ష్మి, దిల్, చత్రపతి, తొలిప్రేమ, లాహిరి లాహిరి లాహిరిలో, సింహ లాంటి సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ నటన ద్వారా సజీవంగా ఎప్పటికీ ఉంటారు. తెర సాంస్కృతిక కళామండలి గౌరవ సలహాదారులు పార సీతయ్య మాట్లాడుతూ… వేణుమాధవ్ కోదాడలో అందరివాడుగా కలిసి ఉండే వారని, సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కోదాడని మరచిపోలేదని, రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు కోదాడలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించి ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్యకి అందించామని, కార్గిల్ అమరుల కోసం నిధి సేకరించారని, కోదాడలో పచ్చదనం, పరిశుభ్రత, హరితహారం లాంటి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొని యువతను చైతన్యపరిచారని, ఎంత అలసిపోయినప్పటికీ వేణుమాధవ్ హాస్య సన్నివేశాలు చూస్తే ఊరట కలుగుతుందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరా, షేక్ పీర్ సాహెబ్, పాలూరి సత్యనారాయణ, కంచుకొమ్ముల శంకర్, గార్లపాటి వీరారెడ్డి, గుండెల సూర్యనారాయణ యాదవ్, షేక్ యాకూబ్, ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, బుడిగం నరేష్, పెద్దినేని రామారావు, కోలా శ్రీనివాసరావు, దర్శకులు తిరూప్, మచ్చ ఉపేందర్,కందిబండ ఉపేందర్ రావు, ప్రభాకర్ రావు,
సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు.



