ఎన్ఆర్ఎస్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజీ లో ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మలను స్వయంగా తయారు చేసి వాటికి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల్, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, వైస్ ప్రిన్సిపాల్ జీ వీ, పలువురు లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.



