దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి….
:గోపిరెడ్డి నగర్ లో బతుకమ్మ వేడుకలో సందడి చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్): బతుకమ్మ ఉత్సవాలను మహిళలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ బతుకమ్మల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలను తొమ్మిది రోజులు ఎంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకున్న కోదాడ నియోజకవర్గ మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.

నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పాడిపంటలతోటి ఆయురారోగ్యాలతోటి సుఖసంతోషాలతోటి చల్లగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు కమిటీ సభ్యులు తుముల సాయికుమార్, శ్రీ లోజు కృష్ణ చారి, దేవరపల్లి వెంకటరామిరెడ్డి, లంకెల శ్రీనివాస్ రెడ్డి, ఆత్కూరి కొండల్, మహేష్ రెడ్డి,వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి, సతీష్ రెడ్డి,చిత్తలూరు శివయ్య, అగ్గడి హరిబాబు తదితరులు పాల్గొన్నారు……..



