శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయం లో విశేష పూజలు, అన్నదానం.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 30 (ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ చిలుకూరు మండల కేంద్రంలో గల కాల్వ ఒడ్డు దగ్గర గల శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో సెప్టెంబర్ నెల చివరి రోజు మంగళవారం ఆశ్వీయుజ మాసం రెండవ మంగళవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక ఆకు పూజలు నిర్వహించారు. అన్నదానం చేయించిన దాతలు చిలుకూరు వాస్తవ్యులు అలసకాని మాధవరావు రాజ్యలక్ష్మి, దంపతులు, వారి కుటుంబ సభ్యులు,గుత్తా సాయిప్రసాద్ రంజిత, దంపతులు, భోజట్ల వినయ్ సరిత దంపతులు, రెడ్లకుంట గ్రామ వాస్తవ్యులు కునుగుంట్ల రవి శ్రీదేవీ దంపతులు, వారి కుటుంబ సభ్యులు, అలవికాని సత్యవరప్రసాద్ అనురాధ దంపతులు, తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతలు ప్రత్యేకంగా స్వామి వారి కి ప్రత్యేక అభిషేకాలు ఆకు పూజ లు చేసారు. తదుపరి ఆలయం ప్రాంగణంలో అన్నదాతలు చే 41 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వాస్తవ్యులు సుందరకాండ శ్రీనివాస్ దంపతులు చే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము, భక్తి గీతాలు, భజన, వారి ఆధ్వర్యంలోసంగీత బృందం, కోలాట భజన మహిళలు చేత చక్కటి సంగీతం తో హనుమాన్ చాలీసా చదవడం జరిగింది. తదుపరి స్వామి వారి విగ్రహం తో ఆటపాటలతో భక్తులు ను అలరించారు. ఆ తర్వాత ఆలయం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 1 గంటకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు దాదాపు 600 వందల పై చిలుకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం సంప్రదాయం ప్రకారం ఆలయం అర్చకులు రజనీ కాంత్ ఆచార్య , కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాతలకు స్వామి వారి మెమెంటో తో సన్మానం చేసి ఆశీర్వాదం అందజేసారు. ఇట్టి కార్యక్రమం లో ఆలయం ఛైర్మన్ శ్రీ కొడారు వెంకటేశ్వర్లు, మాదారపు, లక్ష్మయ్య, బొమ్మిరెడ్డి సమ్మిరెడ్డి, కొడారు శ్రీనివాసరావు, కట్టెకోల చంద్రయ్య, గోపయ్య, వీరభద్రం, సుశీల, దొడ్డా వెంకటి, లక్ష్మీ, రోజా భవానీ, లక్ష్మీ ,లావణ్, మంగమ్మ, పద్మ, గ్రామం పెద్దలు, భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



