స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి.
:కెసిఆర్ సంక్షేమ పథకాలను, రేవంత్ అమలుగాని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి…
:కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు..
:మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్…
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 30(ప్రతినిధి మాతంగి సురేష్): బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని అన్నారు. ఆరు గ్యారంటీలతో, 420 హామీలతో ప్రజలను నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ అమలు కాని హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులను, మహిళలను, నిరుద్యోగులను, సబ్బండ వర్గాలను మోసం చేసింది అన్నారు.స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఐకమత్యంగా పని చేసి ఏకాభిప్రాయంతో ఆభర్థులను ఎన్నుకోవాలని అన్నారు. ప్రజలకు రేవంత్ చేస్తున్న మోసలను అమలుగాని హామీలను ఇచ్చి మోసగించిన విధానాన్ని అర్ధమయ్యేలా వివరించాలని అన్నారు. అధికారం సాధించాలని గ్రామాల్లో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ అభ్యర్థులను భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి బెదిరింపులకు భయపడొద్దని అండగా ఉంటానని ఎంతకైనా వెనుకాడభోమని పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందడుగు వేయాలని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్నారు. ప్రజలు కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని రాభోయే రోజుల్లో కెసిఆర్ పాలన రావాలంటే స్థానిక ఎన్నికలే అందుకు పునాదులు వేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఎన్నికలు ఏవైనా బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరధం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మాజీ సర్పంచులు గడుపూడి శ్రీకాంత్, దొంగల లక్ష్మి నారాయణ, పొట్టా విజయ్ కిరణ్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ ముత్తవరపు రమేష్,మాజీ ఎంపీటీసీ గంటా శ్రీనివాస్,మండల నాయకులు దొంతగాని అప్పారావు, బాలేబోయిన వేలాద్రి, అన్నెం వెంకట్ రెడ్డి, జిల్లా బోసుబాబు, ఉదయ్, కుక్కడపు ఖాజా, కంబాల జగ్గయ్య, గాదె వీరారెడ్డి, కాకుమాను కోటిరెడ్డి, గ్రామశాఖల అధ్యక్షులు గుగులోతు చంద్యా, ముడియాల వెంకట్ రెడ్డి, బాలేబోయిన పాపారావు, మద్దాల అప్పారావు, దాసరి వీరబాబు, షేక్ అబ్దుల్ నభీ, దారావత్ వీరు, బట్టు కోటేశ్వరరావు, పోట్ల సతీష్, బాధవత్ బాబు రావు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



