రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తున్న పిఎసిఎస్ సిబ్బంది
:డబ్బులకు ఆశపడి అధిక ధరలకు యూరియాను అమ్ముకుంటున్న సిబ్బంది.
:అన్ని బస్తాలు ట్రాక్టర్ లో లోడ్ చేస్తుంటే ఇంచార్జ్ సీఈఓ ఏం చేస్తున్నాడని ప్రశ్నించిన రైతులు.
:గతంలో వచ్చిన యూరియా కూడా ఇదే రీతిలో అమ్ముకున్నారని పలువురు రైతులు ఆవేదన.
:కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్థానిక రైతులు
:ఈపాస్ మిషన్ ను రైతుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి తంబు వేయించుకుంటున్న పిఎసిఎస్ సిబ్బంది
:పట్టించుకోని సంబంధిత అధికారులు
:తూతూ మంత్రంగా తనిఖీలు
:సంబంధిత అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయనే గుసగుసలు
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్):10 కుంటలు పొలం ఉన్న రైతుకు ఒకే రోజు 8 యూరియా కట్టలు ఇచ్చి అవినీతికి పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న సంఘటన కోదాడ డివిజన్ అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల సొసైటీలో చోటుచేసుకుంది. సీరియల్ లో ఉన్న గోండ్రియాల రైతులకు ఇంచార్జ్ సీఈఓ ఇవ్వకుండా ఇంచార్జ్ చైర్మన్ తో 80 కట్టల యూరియాను అక్రమ మార్గంలో అమ్మటానికి తరలిస్తుండుగా రైతులు గమనించి నిలదీయగా యూరియా కట్టలను గోడంలో దించినారని వాటికి లెక్కలు చూపించాలని మరుసటి రోజు కొంతమంది రైతుల పేర్లు రాసి పెట్టారని రైతులు వాపోతున్నారు. మా పొలాలు ఎదుగుదల తగ్గిపోతుంటే మాకు ఇవ్వాల్సిన యూరియాను మాకు ఇవ్వకుండా అక్రమ మార్గంలో తరలిస్తున్నారని ఇదేంటి అని ప్రశ్నిస్తే సంబంధిత సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మౌన ప్రదర్శన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా అక్రమ మార్గంలో తరలిస్తున్నారని రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. 80 బస్తాల యూరియా టాక్టర్ కు లోడ్ చేస్తుంటే సీఈవో చూస్తున్నాడే తప్ప ఎవరికి వెళ్తున్నాయి ఏంటి అని సంబంధిత సిబ్బందిని అడిగిన దాఖలాలు ఎక్కడా కూడా కనపడలేదని అన్నారు. డైలీ సేల్స్ రిజిస్టర్ లో గొండ్రియాల రైతులకు రెండు బస్తాలు ఒక బస్తా ఇచ్చినట్టు రాశారు. లకారం రైతులకు మాత్రం ఒక్కొక్క రైతుకి ఐదు బస్తాలు ఇచ్చినట్లు రిజిస్టర్లు రాశారు. లకారం రైతులు చేసుకున్న పుణ్యం ఏంటి గొండ్రియల రైతులు చేసుకున్న పాపం ఏంటని రైతులు వాపోతున్నారు. ఈపాస్ మిషన్ బయటకు తీసుకువెళ్లి రైతుల తంబు వేయించుకున్న కార్యాలయ సిబ్బంది రెండు రోజులు కార్యాలయానికి రాలేదు. తను ఎందుకు రాలేదని రైతులు అడిగితే ఇంచార్జ్ సీఈఓ నుండి ఎలాంటి సమాచారం లేదని రైతులు వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి సంబంధిత అధికారులకు షోకాస్ నోటీస్ ఇష్యూ చేశానని తెలిపారు.

*80 బస్తాలు ట్రాక్టర్ లో లోడ్ చేస్తుంటే ఇంచార్జ్ సీఈఓ ఏం చేస్తున్నాడని ప్రశ్నించిన రైతులు*
ఇన్చార్జి సీఈవో కళ్ళముందే ఒకే ట్రాక్టర్ లో 80 యూరియా బస్తాలు లోడ్ చేస్తే ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి అని సంబంధిత సిబ్బందిని ఇంతవరకు అడగకుండా ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని రైతులు వాపోతున్నారు. గత లోడు లలో కూడా ఇదే రీతిగా పంపించి ఉంటారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్థానిక రైతులు*
రైతులు యూరియా కోసం రోజుల తరబడి సీరియల్ లో నిలబడితే మీకు ఒక బస్తా, రెండు బస్తాలు ఇస్తామని చెప్పి అందరికీ అలా ఇవ్వకుండా కొంతమందికి తక్కువ పొలం ఉన్న ఐదు బస్తాలు ఎనిమిది బస్తాలు 10 బస్తాలు ఇచ్చామని డైలీ సేల్స్ రిజిస్టర్లో రాసి వాటిని పక్కదారి పట్టిస్తున్నారని స్థానిక రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినామని వాపోయారు.
*డబ్బులకు ఆశపడి అధిక ధరలకు యూరియాను అమ్ముకుంటున్న సిబ్బంది*
పిఎసిఎస్ సిబ్బంది ఈమధ్య కాలంలో యూరియా కొరత ఏర్పడిన నాటినుండి రైతులకు ఇవ్వాల్సిన యూరియా బస్తాలను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోయారు.
*ఈపాస్ మిషన్ ను రైతుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి తంబు వేయించుకుంటున్న పిఎసిఎస్ సిబ్బంది*
పిఎసిఎస్ వారు వాడే ఈపాస్ మిషన్ ను వారికి నచ్చిన రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి తంబు వేయించుకుంటున్నారు. రైతులు వారి వడ్లను మ్యాచర్ చూసుకుందామని పిఎసిఎస్ సిబ్బందిని అడిగితే రైతులకు ఇవ్వరు అలాంటిది ఈపాస్ మిషన్ ఎలా ఇండ్ల వద్దకు పంపారని రైతులు ప్రశ్నించగా సిబ్బంది నుండి ఎలాంటి స్పందన లేదని రైతులు తెలిపారు. ఈరోజు మిషన్ లనే ఎక్కడ కంటే అక్కడికి తీసుకువెళ్లారు రేపు పిఎసిఎస్ బ్యాంకులో ఉన్న మా బంగారం పరిస్థితి ఏంటి అని అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపాస్ మిషన్ బయటకు వెళ్లిందని మండల వ్యవసాయ అధికారి సమాచారం తెలుసుకొని వారికి ఫోకస్ నోటీసులు జారీ చేశాడని మండల వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.
*పట్టించుకోని సంబంధిత అధికారులు*
గొండ్రియాల పిఎసిఎస్ కార్యాలయంలో యూరియాను అక్రమ మార్గంలో తరలిస్తున్నారని సంబంధిత అధికారులకు విన్నవించుకున్న అధికారులు వస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుందని రైతులు వాపోతున్నారు. ఇకనైనా డైలీ సేల్స్ రిజిస్టర్ లో ఎంట్రీ చేసిన రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి ఎంక్వయిరీ చేయాలని పలువులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*ఇన్చార్జి సీఈఓని చరవాణి ద్వారా వివరణ అడగగా*
ఈపాస్ మిషన్ బయటికి వెళ్లిందంటే మా ప్రాపర్టీ అక్కడ ఉండటంవల్ల బయటికి పంపామని అన్నారు. ట్రాక్టర్లో లోడ్ చేసిన 80 బస్తాలు ఎటు వెళ్తున్నాయని అడగగా అవి రైతులకే వెళ్తున్నాయని తెలిపారు. డైలీ సేల్స్ రిజిస్టర్ లో ఒక్కొక్క రైతుకి ఐదు బస్తాలు ఇచ్చారు ఏంటి అని అడగగా వారికి కవులు పొలాలు ఉండటం వలన ఇచ్చామని తెలిపారు.



