స్వయంకృషితో వ్యాపార రంగంలో రాణించాలి
:ఇరానీ చాయ్ కి కేరాఫ్ తార టీ స్టాల్.
:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించి స్వయంకృషితో వ్యాపార రంగంలో రాణిస్తున్న తారా టీ స్టాల్ యాజమాన్యం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డులో నూతనంగా అన్ని హంగులతో ఏర్పాటు చేసిన తారా టీ స్టాల్ అండ్ బేకర్స్ రెండవ బ్రాంచ్ ను నిర్వాహకులు అజార్ బాబాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కోదాడలో గత కొన్ని సంవత్సరాలుగా తారా టీ స్టాల్ అండ్ బేకర్స్ యాజమాన్యం వారు ప్రజలకు నమ్మకమైన సేవలందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందారాని ఇదే నమ్మకంతో వినియోగదారులకు సేవలు అందించి వ్యాపారాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. తారా టీ స్టాల్ యజమాని అజార్ బాబా తాను ఉపాధి పొందుతూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆమె తెలిపారు.

త్వరలో హుజూర్ నగర్ లో సైతం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ 15 వార్డు కౌన్సిలర్ ఎస్.కె షఫీ, అతోహర్, సోయల్, పాశి, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.



