Tuesday, December 23, 2025
[t4b-ticker]

యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.

యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.

:వ్యాపార రంగాలలో యువత ముందుండాలి.

: టిపిసిసి డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి.

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్): యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెంది వ్యాపార రంగాలలో యువత ముందుండాలని టిపిసిసి డెలిగేట్ బార్, అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణానికి చెందిన యువకుడు జూకూరి నాగసాయివర్మ ఆధ్వర్యంలో మన చద్దన్నం అల్పాహార సెంటర్ ను స్థానిక నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసినాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు పాల్గొని అల్పాహార సెంటర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తను ఎన్నుకున్న రంగాల్లో మంచి క్వాలిటీతో ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించి తను ఎన్నుకున్న మార్గాన్ని కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడే ఆ రంగంలో సఫలీకృతం అవుతారని అన్నారు. మంచి ఆలోచనతో పాత కాలాన్ని గుర్తుకు వచ్చేలా అల్పాహార సెంటర్ ని ఏర్పాటు చేసిన నాగసాయి వర్మను అభినందించారు. వ్యాపారరంగంలో దినదినం అభివృద్ధి చెంది ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం అతిధులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోప్రైటర్ జూకూరి నాగసాయివర్మ, షేక్ హర్షద్, కెవి రత్నం, రాజేష్, ప్రశాంత్, వీరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular