ప్రేమతో ఊర పిచ్చుకకి ప్రాణం పోసిన పాత్రికేయులు నకిరికంటి కరుణాకర్
:ప్రాంతీయ పశువైద్యశాల కోదాడ లో విరిగిన పిచ్చుక రెక్కకి శస్త్రచికిత్స .
:పర్యావరణ పరిరక్షణలో అత్యంత అవసరమైన పక్షుల ప్రాణ రక్షణ మన భాద్యత అంటున్న అసిస్టెంట్ డైరెక్టర్.

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): అనంతగిరి మండల కేంద్రానికి చెందిన పాత్రికేయులు నకిరికంటి కరుణాకర్ ఇంట్లోకి ప్రవేశించిన ఊరపిచ్చుక తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కి తగిలి రెక్క విరగడంతో పైకి ఎగురలేక షాక్ తో కింద పడిపోయింది గమనించిన కరుణాకర్ పక్షిపై ప్రేమతో ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్యకి ఫోన్ ద్వారా సమాచారమిచ్చి వెంటనే పిట్టని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకి తీసుకు వచ్చారు.
విరిగిన రెక్కను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ పిచ్చుక షాక్ నుండి కోలుకోవడానికి ఎలక్ట్రోలైట్ అందించి శస్త్ర చికిత్స ద్వారా విరిగిన రెక్క ఎముకలను జతచేస్తూ కుట్లు వేసి రెక్కను అతికించారు.
శస్త్రచికిత్స అంతరం పిచ్చుక సహజంగా ఎగరడం తో దాని ప్రాణాలపై ఆదుర్దా పడిన పాత్రికేయులు ఆనందం వ్యక్తం చేస్తూ దాని కిట్ల గాయం మానే వరకు రెండు మూడు రోజులు ఇంట్లోనే ఉంచి తరువాత బైటకు వదిలేస్తానని తెలిపారు. పక్షులు బైట ఆహారం దొరకనప్పుడు ఇలా ఇండ్లలోకి ప్రవేశిస్తాయని ఆకలికోసం ప్రాణాల్ని పోగొట్టుకుంటాయని ఇలాంటి ప్రమాదాల్ని నివారించడానికి ఇండ్ల ప్రహరీ గోడలపై , ఆవరణలోని చెట్లపై కొన్ని గింజలను, చిన్న పాత్రల్లో తాగునీటిని ఉంచినట్లయితే వాటిని ఆరగిస్తూ పక్షులు ఆకలి తీర్చుకొని ప్రశాంతంగా జీవిస్తాయని పర్యావరణ పరిరక్షణలో ముఖ్యభూమికపోషించే పక్షులను కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరు ఈ చిన్నపాటి ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య కోరారు. శస్త్ర చికిత్సలో సిబ్బంది చంద్రకళ అఖిల్ పాల్గొన్నారు.



