ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి…
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని యర్రవరం పిఎసిఎస్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. రైతులు ధాన్యం అమ్మడానికి ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని తెలిపారు.పలువురు నాయకులు మాట్లాడుతూ మంగళవారం కురిసిన అకాల వర్షానికి మండలం లో వరి పంట నేలకొరిగిందని దానికి తక్షణమే అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఈర్ల సీతరామిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నలజల శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ కొప్పుల సుభాష్ రెడ్డి, డైరెక్టర్లు మoడది శ్రీను, గుగులోతు రవి, బాదిని శ్రీను, వాంకోదోడోత్ సైదా, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కొప్పల శ్రీనివాస్ రెడ్డి, డిసిసి మాజీ చైర్మన్ కోటిరెడ్డి, అన్నెం వెంకట్ రెడ్డి, బానోత్ అంబేద్కర్, ఏఈఓ సల్మా, సీఈవో మౌలాలి, గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ లతీఫ్, వేమూరి మధు తదితరులు పాల్గొన్నారు.



