నిరుద్యోగులందరు మెగా జాబు మేళర్ ను సద్వినియోగం చేసుకోవాలి.
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆశావహ నిరుద్యోగ యువత కోసం ఈనెల అనగా 25.10.2025 శనివారం హుజూర్ నగర్ పట్టణంలో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతున్న అతిపెద్ద ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని టీఎన్జీవో కోదాడ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి విక్రమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతలను బట్టి ఉద్యోగాలు
150 + అగ్ర కంపెనీలు వస్తున్నట్లు తెలిపారు. 2000 నుండి 5000 ఉద్యోగ ఖాళీలు పదవ తరగతి నుండి అర్హతలు అందరికీ అవకాశం. తేదీ
25 అక్టోబర్ 2025 తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నారని తెలిపారు. హుజూర్ నగర్ లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ మెగా జాబ్ మేళలో పాల్గొనాలనుకునేవారు ఇప్పుడే నమోదు చేసుకోవడానికి కోడ్‌ను స్కాన్ చేయండి లేదా https://డీటైల్స్.తెలంగాణ.gov.in ని సందర్శించండి.అభ్యర్థులందరూ తమ వెంట రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, 5 సెట్ల రెస్యూమ్(బయో డేటా) ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.అభ్యర్థులకు భోజన సౌకర్యం వీలైనంత మేరకు రవాణా సౌకర్యం కల్పించబడును. అభ్యర్థులందరూ సులువుగా పాల్గొనడం కోసం పైన తెలిపిన లింక్ ద్వారా ముందుగా అనగా 23, 24 వ తేదీలలోనే రిజిస్ట్రేషన్ చేసుకోగలరని తెలిపారు.



