మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు.
:ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించిన అట్టి ఆటోల పైన ఆటో డ్రైవర్ పైన కఠిన చర్యలు..
:పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి: ఎస్సై జి అజయ్ కుమార్.
Mbmtelugunews//నడిగూడెం, అక్టోబర్ 27 (ప్రతినిధి మాతంగి సురేష్):వాహనదారులు మైనర్ లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నడిగూడెం ఎస్సై జి అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. డబ్బులకు ఆశపడి ఆటోలలో పరిమితికి మించిన ప్రయాణికులు ఎక్కించిన, గూడ్స్ ఆటోలలో సుమారుగా 30 మంది ప్రయాణికులు వెళ్తున్నారు అటువంటి ఆటోలను పట్టుబడి చేసి కేసు బుక్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుందని అన్నారు. పిల్లలకు అతిగారభంతో లక్షల రూపాయలు వెచ్చించి టు వీలర్ వాహనాలు, కార్లు, సెల్ ఫోన్లు అప్పు చేసి కొనటంతో వారికి తల్లిదండ్రుల కష్టం విలువ తెలియకుండా గంజాయి, మత్తు, సిగరెట్లు, పాన్ లకు అలవాటు అయ్యి మితిమీరిన వేగంతో ఎదుటివారి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని అన్నారు. ఆ ప్రమాదంలో అతను కూడా చనిపోవడం జరుగుతూ ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా కర్నూలు లో జరిగిన బస్సు ప్రమాదం గుర్తుంచుకోవాలని ఎస్ఐ తల్లిదండ్రులను కోరారు. ఎప్పటికప్పుడు పిల్లలు ఏ క్షణంలో ఏం చేస్తున్నారు ఎటు పోతున్నారు అని పర్యవేక్షణ చాలా కీలకమని వెల్లడించారు. రాత్రి 12, ఒకటి, రెండు గంటల వరకు రోడ్ల పైన విచ్చలవిడిగా వాహనాలు నడుపుతూ తిరుగుతున్న తల్లిదండ్రులు పట్టించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.



