ప్రాంతీయ పశువైద్యశాల సేవలు-
అభినందించిన జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి .
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 29( ప్రతినిధి మాతంగి సురేష్): భారీ వర్షాల నుండి పశు సంరక్షణకు పశువైద్యులు, వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి డా, దాచేపల్లి శ్రీనివాసరావు అన్నారు.కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలను బుధవారం ఆయన సందర్శించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ని ప్రాంతీయ పదువైద్యశాలలో భారీ వర్షంలో సైతం విధులు నిర్వహిస్తూ పశుపోషకులకు అన్నివేళలా వైద్యసేవలందించడానికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖకు మంచి పేరు తెస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి పెంటయ్యను వారి సిబ్బందిని అభినందించారు.పశుపోషకులకు ఆసరాగా నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ ద్వారా సంవత్సరంలో 3.6 కోట్ల అదనపు సంపద సృష్టించడం డిపార్ట్మెంట్ చరిత్రలో ఒక మైలురాయి అని కొనియాడారు. లోతట్టు ప్రాంతాల్లో పశువుల్ని కట్టి ఉంచరాదు. ఇంటి వద్ద లేదా ఏదైనా ఎత్తైన. నీరు నిలువని, వరద రాని ప్రాంతం లోనే పశువుల్ని కట్టి ఉంచాలి.వర్షం సమయం లో పశువుల్ని బైటకు మేతకు పంపరాదు.చెరువుల వద్దకు , కాలువల వెంట నీటికోసం పశువుల్ని తోలరాదు.చెట్ల కింద పశువులు/ గొర్రెలు / మేకలను నిలిపి ఉంచరాదు.శిథిల పశువుల పాకలు భవనాలకు దూరంగా పశువుల్ని ఉంచాలి.అత్యవసర పరిస్థితిల్లో వైద్య సహాయం కోసం పశుపోషకులు తమ దగ్గరలోని పశువైద్యుల ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవాలి.కరెంట్ వైర్లు, స్తంభాలకు దూరంగా పశువుల్ని ఉంచాలి.అంటువ్యాధుల నివారణకు పరిశుభ్రమైన నీటిని అందించాలి. చికిత్స కన్నా నివారణ మేలన్న నానుడి ననుసరించి పశుపోషకులందరూ ఈ భారీ వర్షాల విపత్కాలంలో ఏమరుపాటుకు తావేయకుండా పై సూచనలు పాటించి తమ పశువుల ప్రాణాల్ని కాపాడుకోవాలని అన్నారు.



