రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది…
:పిఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 30(ప్రతినిధి మాతంగి సురేష్): రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అని యర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని యర్రవరం గ్రామ పరిధిలో తుఫాన్ దాటికి నీట మునిగిన, నేలకొరిగిన పంట పొలాలను మండల వ్యవసాయ అధికారిని రజని తో కలిసి పరిశీలించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట నేలకొరిగిందని, దీంతో పంట దిగుబడి తక్కువగా వచ్చి రైతులు ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు రైతులకు అండగా ఉంటారని తెలిపారు. విషయాన్ని వారి దృష్టికి తీసుకుని వెళ్లి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులందరికీ నష్టపరిహారం అందేలా అధికారులు చూడాలని తెలిపారు. వారి వెంట ఏఈఓ సల్మా, సీఈవో మౌలానా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



