తుఫాను కు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: బత్తినేని హనుమంతరావు
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 30( ప్రతినిధి మాతంగి సురేష్): రెండు రోజుల క్రితం కురిసిన మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకొని ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కమ్యూనిస్టు పార్టీ కోదాడ మండల కార్యదర్శి బత్తినేనిహనుమంతరావు
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలోని ఉన్న గ్రామాలలో మొంథా తుఫాన్ కారణంగా వరి పంటతో, పాటు ఇతర పంటలు నీట మునిగి కిందపడిపోయి పొలాలలో నీళ్లు నిలవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారని వారందరినీ ప్రభుత్వం ఆదుకొని ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం రైతుల దయనీయ పరిస్తితిని అర్ధం చేసుకొని రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని తెలిపారు. రైతు ఆరు కాలం పంటను పండించి కోసుకునే సమయానికి ఈ తుపాను వచ్చి రైతులను ఆర్థికంగా కుంగదీసిందని అన్నారు. నష్టపోయిన రైతులకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.



