కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం
కోదాడ, నవంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు చేసే పూజలు అన్నదానాలు పుణ్య కార్యాలని మహా లక్ష్మయ్య గురు స్వామి అన్నారు. కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు స్వామి నివాసంలో శనివారం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నదాత మాట్లాడుతూ అయ్యప్ప మాలదారులు 41 రోజు ఉపవాసాలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి దీక్షలు చేపడతారని స్వాములకు అన్నదానం ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉంటుందని అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. గురు స్వామి మహా లక్ష్మయ్య గణపతికి అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వాములకు సద్ది అనంతరం రావెళ్ల కృష్ణారావు మాలతి, తాళ్లూరి నరసింహారావు సరిత దంపతులచే స్వాములకు పండ్లు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మల్లెల రామయ్య, చలిగంటి లక్ష్మణ్, బద్రి, బాదే రాము, మరికంటి లక్ష్మణ్, బండి శ్రీనివాస్ గౌడ్, కన్నె స్వాములు, వీటి స్వామి తదితరులు పాల్గొన్నారు.



