జంతు ప్రాణసంరక్షణకి చిన్నారి విరాళం అమోఘం- అమూల్యం
:డా. దాచేపల్లి శ్రీనివాసరావు
కోదాడ, నవంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో గత సంవత్సరం వినూత్నంగా ప్రారంభించి నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ నకు దాతలు వాలంటీరుగా ముందుకు వచ్చి పశు ఔషధాలు అందించడం అభినందనీయమని జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా దాచేపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి విష్ణు మహదేవాన్స్ ఏడువేల రెండు వందల రూపాయల పశు ఔషధాలకు విరాళంగా ఇచ్చిన సందర్భంగా చిన్నారిని వారి తల్లి దండ్రులను అభినందించారు.ఈ విరాళంగా జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి, ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి.పెంటయ్యకి అందించారు. చల్లా వెంకటేశ్వర్లు తన వృత్తిలో ఈ విరాళం అందించడం జరిగిందని అన్నారు.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పశు ఔషధ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవలను చూసి అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యానని, అప్పుడే నా వృత్తిలో పదోన్నతి లభిస్తే తొలుత పశు ఔషధ బ్యాంక్ నకు తన కుమారుడి చేత విరాళంగా పశు ఔషధాలను ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడు పదోన్నతి లభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రీజనల్ మేనేజర్ గా విధుల్లో చేరిన సందర్భంగా పశు ఔషధ బ్యాంక్ నకు ఈ విరాళం అందించి సంతృప్తి పొందానని అనందంతో తెలిపారు.
గోసేవ దైవసేవతో సమానమంటారు.రోజువారీ మనం ఎన్నెన్నో ఖర్చులు పెడుతుంటాము. అందులో కొద్దిగా ఇలా మూగజీవాల సంరక్షణకు ఉపయోగించడం చాలా మంచి కార్యక్రమం అని జిల్లా అధికారి అన్నారు. ఈ
కార్యక్రమములో కాపుగల్లు ప్రాథమిక పశువైద్యకేంద్రం పశువైద్య సహాయ శస్త్ర చికిత్సలు డా సురేందర్, సిబ్బంది రాజు, చంద్రకళ పాల్గొన్నార.



