అన్ని దానాల కన్నా మహాదానం రక్తదానం
:రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి.
: శ్రీ చైతన్య స్కూల్స్ ఈజిఎం ఎమ్ మురళీకృష్ణ
Mbmtelugunews// కోదాడ,నవంబర్ 06(ప్రతినిధి మాతంగి సురేష్): అన్ని దానాల కన్నా గొప్పదనం రక్తదానం,రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి అని చైతన్య స్కూల్స్ ఈజిఎం ఎమ్ మురళీకృష్ణ అన్నారు.గురువారం కోదాడ శ్రీ చైతన్య స్కూల్స్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ పాఠశాలలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా, ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని స్థానిక తిరుమల బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా చైర్మన్ జన్మదిన వేడుకలకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 49 మంది రక్తాన్ని సేకరించామని తెలిపారు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమందికి రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలుస్తున్నా మని తెలిపారు.రాబోయే రోజులలో ఈ ట్రస్టు ద్వారా ఎంతోమందికి రక్తం అందించడానికి సహకరిస్తున్న ప్రతి వక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ దండా వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్స్ బి గోపాలస్వామి, ఏ వీరారెడ్డి, ఎల్ ప్రవీణ్ కుమార్, డీన్స్, ట్రాన్స్ పోర్ట్ ఇంచార్జ్ జానీ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



