కోదాడ పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్.
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): డిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసు శాఖ భద్రత చర్యల్లో భాగంగా కోదాడ పట్టణంలో జిల్లా పోలీస్ భద్రతా విభాగం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరుల భద్రతా కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈతనికీలు చేశారు.ఈ తనిఖీల్లో పాల్గొన్న డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు బస్టాండ్, కూరగాయల మార్కెట్, షాపింగ్ మాల్స్ వద్ద విసృత తనిఖీలు నిర్వహించారు. బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు బస్సులు, ప్రయాణికుల లగేజీ అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలు నివారణ కోసం విస్తృతమైన ఈ తనిఖీలు నిర్వహించారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులు లాడ్జ్ ల నందు వసతి ఇవ్వవద్దు అని కోరారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్, పేలుడు పరదర్ధాలు గుర్తించే డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు.



