తేజ టాలెంట్ స్కూల్ యందు బాలల దినోత్సవం
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు నవంబర్ 14 బాలల దినోత్సవమును ఘనంగా నిర్వహించారు అలరించారు. పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవంను నిర్వహించారు వివిధ హోదాలలో వారి వారి నైపుణ్యాలను ప్రదర్శించారు విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని మేము ఈరోజు తెలుసుకున్నామని వివిధ విద్యార్థులు తెలియజేశారు కార్యక్రమము మొత్తం నూతన ఉపాధ్యాయులు అధికారులతో కోలాహలంగా మారింది పిల్లలే నేటి బాలలు రేపటి గురుతర బాధ్యతగల పౌరులం అంటూ నినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సోమనాయక్, సెక్రటరీ సంతోష్ కుమార్, ఇన్చార్జిలు రామమూర్తి, నవ్య, రేణుక, డైరెక్టర్ జానకిరామయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



