గొర్రె కడుపులో అయిదు కిలోల ప్లాస్టిక్ తొలగింపు .
గొర్రె పొట్టలో వడ్లు తీయడానికి ఆపరేషన్ మొదలుపెడితే కిలోలకి కిలోల ప్లాస్టిక్ కవర్లు లభ్యం.
కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో శస్త్రచికిత్స ద్వారా గొర్రెకు పునఃప్రాణం.
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): ఆమధ్య ఆవు కడుపులో 100 కిలోలు, మొన్న కోడి పుంజు కడుపులో ప్లాస్టిక్ కవర్లు తొలగించిన ఘటనలు మరువకముందే ఈరోజు గొర్రె కడుపులో ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్ల తొలగింపు ప్రమాదంలో జంతువుల ప్రాణాలు అనడానికి నిదర్శనాలు.మునగాల మండలం నర్సింహాపురం గ్రామానికి చెందిన వీరబోయిన ధనయ్య పదిహేనురోజుల క్రితం కొన్ని గొర్రెలు కొన్నాడు. పదిరోజులక్రితం ఒక గొర్రె ఈని గొర్రె పిల్లను కూడా ఇచ్చింది. వరికోతల సమయం కావడం గతంలో కురిసిన వర్షాలకు నేలకొరిగిన వరిపంట.మిషన్ కోతల సమయంలో నేలకొరిగిన వడ్ల పంజలు అలాగే వదిలేయడం తో వరికోసిన పొలాల్లోకి గొర్రెలను తోలి మేపుతున్నారు. అలా వడ్లు ఎక్కువగా తినడంవల్ల నిన్న ఒక గొర్రె చనిపోవడం రెండవది మేతమేయకపోవడం, పొట్ట ఉబ్బి ప్రమాదకరంగా ఉండడం తో కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు వచ్చారు. పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించగా ఊహించని విధంగా వడ్లకంటే ఎక్కువగా 5 కిలోల ప్లాస్టిక్ కవర్ల ముద్దలు బైటకి రావడం జరిగింది. ప్లాస్టిక్ కవర్లను. వడ్లను తొలగించి విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం తో గొర్రె ప్రాణాపాయం నుండి బైటపడింది.అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ గొర్రెలను జనావాస ప్రాంతాల్లో చెత్త చెదారం ఉన్న ప్రాంతాల్లో మేపడం ద్వారా తినుబండారాలతో పడేసిన ప్లాస్టిక్ కవర్లను ఆహారంతో పాటు నమిలి మింగుతాయని. ఒక్కసారి ప్లాస్టిక్ కవర్లు కడుపులోకి వెళ్తే ఎవరి అరగవు కరగవు. బైటకు వెళ్ళాక వెనక్కి రాక పొట్టలోనే చుట్టలు చుట్టలుగా తిరుగుతాయి. అలాంటి జీవాలు ఎక్కువమోతాదులో వడ్లను తిన్నప్పుడు వడ్లు ప్లాస్టిక్ కవర్లలో చిక్కి అవి కూడా అరగక పొట్ట ఉబ్బి కడుపునొప్పి గ్యాస్ తో గొర్రె నరకయాతన అనుభవిస్తూ చనిపోతుంది. ఈ గొర్రె విషయంలోనూ అదే జరిగింది. సకాలంలో ఆపరేషన్ తో గొర్రె ప్రాణాపాయం నుండి బైటపడింది.గొర్రెల కాపరులు గొర్రెలను జనావాస ప్రాంతాల్లో చెత్తదిబ్బల్లో మేపకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
శస్త్రచికిత్స లో సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్ పాల్గొన్నారు



