శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవస్థానములో పవిత్రోత్సవం
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెం లో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవస్థానములో పవిత్రోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టుదారాములతో మరియు నూలు దారములతో పంచవర్ణములలో (పసుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులలో) తయారు చేసి శాస్త్ర నిర్దేశిత గ్రంధులతో నిర్మింపజేసిన వాటిని పవిత్రాలు అంటారు. ఆ పవిత్రాలను శాస్త్ర ప్రకారముగా సంస్కరింపచేసి ఆయా మంత్రములతో భగవత్ సాన్నిధ్యం కలిగిన అర్చామూర్తులకు పరివార దేవతలకు విమాన, బలిపీఠ, ధ్వజస్తంభ, ప్రాసాద గోపురాదులకు పవిత్ర సమర్పణ మరియు ఆరాధన ఉపకరణములకు పవిత్ర గ్రంధి వేయు ప్రక్రియలనే పవిత్రోత్సవం అంటారు.

సంవత్సర కాలంలో పరమాత్మ సన్నిధిలో తెలిసి తెలియక సంభవించే దోషముల పరిహారం కొరకు చేసే ఉత్సవమే పవిత్రోత్సవం.భగవంతుని అనుగ్రహాన్ని అందించి మనలోని దోషాలను తొలగించి మనల్ని పునీతులుగా తీర్చిదిద్దే ఉత్సవం ఈ పవిత్రోత్సవం ఈ ఉత్సవములో ఇతోధికముగా తమ పవిత్రమైన ద్రవ్యాన్ని సమర్పించి, శ్రీవారి వైభవాన్ని దర్శించి స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము.ఇట్టి కార్యక్రమాలలో యావన్మంది భక్తులు పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించినారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ముడుంబ వేణుగోపాలచార్యులు, దేవాలయ అర్చకులు ముడంబ జగన్నాథాచార్యులు, కార్యనిర్వహణాధికారి
తుమ్మల వెంకటచలపతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



