మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.
:నడిగూడెం ప్రధాన వాగు సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి.
:స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలి.
:నడిగూడెం జిపి భవన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
Mbmtelugunews//కోదాడ (నడిగూడెం), నవంబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్):నడిగూడెం గ్రామంతో పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోదాడ శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.నడిగూడెం మండల కేంద్రంలో ఎన్ఆర్ఇజిఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనంను మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నడిగూడెంకు జిపి భవనం,సీసీ రోడ్లు నిర్మాణంతో పాటు నాలుగు అంగన్వాడి కేంద్రాలకు భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని మరొక అంగన్వాడి సెంటర్ ని కూడా మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయమునకు కావలసిన అవసరాలకు నిధులు కేటాయిస్తానని తెలిపారు. నడిగూడెంలో తేలికపాటి వర్షాలకు కూడ ఎస్సీ బీసీలు కాలనీలు మునుగుతున్నాయని కాలనీలకు ఇబ్బంది లేకుండా చెరువు అలుగుకు సంబంధించిన ప్రధాన వాగుకు శాశ్వత పరిష్కారం చూపుతానని తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ద్వేయంగా పని చేస్తుందని, ప్రజలందరూ తెలంగాణ ప్రజా ప్రభుత్వంను ఆదరించాలని కోరారు. భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ భవనమును త్వరగా పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు,కాంట్రాక్టర్ పల్లపు శ్రీనివాస్ ను అభినందించారు. అనంతరం పలువురు అధికారులు,పార్టీ నాయకులు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరు తిరుపతమ్మ సుధీర్,మండల పార్టీ అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, పిఆర్ డిఈ హర్ష, తహాశీల్దారు రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో మల్సుర్ నాయక్, ఏఈ లావణ్య, సింగిల్ విండో చైర్మన్ రాజేష్, స్పెషల్ ఆఫీసర్ అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి, మాజీ ప్రజా ప్రతినిధులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్, కాంగ్రెస్ పార్టీ మండల,గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



