ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు
:అక్షరం ఆరోగ్యం ఆర్థికంతో స్వేరోస్ నెట్ వర్క్ ముందడుగు.
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పట్టణ పరిధిలో, నియోజకవర్గ స్థాయిలో ఆదివారం
డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా స్వేరోస్ ప్రతిజ్ఞ దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పట్టణ కేంద్రంలో ప్రతిజ్ఞ దివాస్ లో భాగంగా మండల అధ్యక్షులు పాముల రాకేష్ అధ్యక్షతన రంగా థియేటర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అనాధలకు అన్నదానం, శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల ఆశ్రమంలో, ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చెడపకు రవికుమార్ స్వేరో, మాతంగి ఏసుబాబు, కొండపల్లి శ్రీకాంత్, మోహన్ కుమార్, పాముల శంబయ, పైడిపల్లి సాగర్, పాముల వెంకన్న, జ్యోతిరాణి, కాంపాటి వీరస్వామి, గోపాలస్వామి, తదితరలు పాల్గొనడం జరిగింది.



