19 వ పిఎస్ఏ టోర్నమెంట్స్ విజయవంతం కావాలి
:క్రిస్టియన్ స్కూల్ లతో నాకు ఎనలేని సంబంధాలు ఉన్నాయి.
:సీసీ రెడ్డి స్కూలుకు ఎలాంటి అవసరాలు ఉన్న నాకు తెలియపరచండి.
: సిసి రెడ్డి స్కూల్ తో నాకు ఎనలేని సంబంధాలు ఉన్నాయి
: నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mbmtelugunews//కోదాడనవంబర్ 26:(ప్రతినిధి మాతంగిసురేష్): సిసి రెడ్డి స్కూల్ తో క్రిస్టియన్స్ స్కూల్ తో నాకు ఎనలేని సంబంధాలు ఉన్నాయని పాత రోజులు గుర్తుకొస్తున్నాయని నీటిపారుదల &పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సీసీ రెడ్డి స్కూల్ ఆవరణంలో ఫుల్ హెచ్ఎం ఆన్ జ్యోతి ఆధ్వర్యంలో ది 26, 27, 28 (3 రోజులు) 19 వ పిఎస్ఏ టోర్నమెంట్స్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నాలుగు రాష్ట్రాల క్రిస్టియన్స్ 30 స్కూల్స్ తో టోర్నమెంటు ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 19 వ పిఎస్ఏ టోర్నమెంట్స్ కు నన్ను ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను నా బాల్య జీవితంలో క్రిస్టియన్ స్కూళ్లలో చదువుకున్నానని పాత రోజులను నెమరు వేసుకున్నారు. సిసి రెడ్డి స్కూల్స్ తో నాకు ఎనలేని సంబంధాలు ఉన్నాయని స్కూల్ కి ఎలాంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే నేను ప్రభుత్వం తరఫున పరిష్కరించడానికి కృషి చేస్తానని గుర్తు చేశారు. ఈ గేమ్స్ కి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సిస్టర్స్ ని పిల్లలని అభినందించారు. ఈ గేమ్స్ విజయవంతం కావాలని కోరుకున్నారు. అనంతరం బాలబాలికలు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి అభినందించారు. ఈ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం స్కూల్ యాజమాన్యం మెమెంటో తో మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ టోర్నమెంట్స్ కి 1500 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుపీరియర్ జనరల్ హైదరాబాద్ వట్టి జపమాల, ప్రివెన్షియల్ సుపీరియర్ ఉడుముల శౌరీలమ్మ, టిపిసిసి డెలిగేట్ &బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, 30 స్కూల్స్ సిస్టర్స్, బాల బాలికలు, తదితరులు పాల్గొన్నారు.



