మూగజీవుల ప్రాణాల్లో కీ.శే డాక్టర్ బోడ గాయత్రి పేరు చిరస్మరణీయం .
:డా దామెరచర్ల శ్రీనివాసరావు , జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక అధికారి.
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణం ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో పశు ఔషధ బ్యాంక్ నకు వైజాగ్ పశువైద్యులు కీ.శే బోడ గాయత్రి పేరు మీద కోదాడ పశు వైద్య ప్రాంతీయ వైద్యశాల డాక్టర్ పి పెంటయ్య 50 వేల రూపాయలు పశు ఔషధ బ్యాంకుకు జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక అధికారి డా దామెరచర్ల శ్రీనివాసరావు చేతుల మీదుగా విరాళంగా అందించారు. మూగజీవాలకోసం యాబది వేల రూపాయలను రివాల్వింగ్ ఫండ్ గా ఉపయోగిస్తూ సకల జంతుజాలానికి అవసరమైన ఫెర్ స్ట్రాన్ ఔషధాన్ని పశుపోషకులకు పంపిణీ చేసిన జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా. దామెరచర్ల శ్రీనివాసరావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయత్రి పశువైద్యురాలిగా, అకుంఠిత దీక్షతో, అందరికీ తలలో నాలుకలా అత్యుత్తమ సేవలందిస్తూ పశుపోషకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించి,అతి చిన్న వయస్సులోనే కాన్సర్ కారణంగా దివికేగిన కీ శే,, డా. బోడ గాయత్రి డాక్టర్ పి పెంటయ్యకు జూనియర్ ఆమె పేరు మీద విరాళంగా అందించడం అభినందనీయమని అన్నారు. అదే హాస్పటల్లో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ తన జూనియర్ ఫ్యామిలీ ఫ్రెండు అయినా గాయత్రీ పేరుమీద 50వేల రూపాయలు అందించిన పెంటయ్యను అభినందించారు.ఈ కార్యక్రమములో అనంతగిరి మండల పశువైద్యాధికారి డా సిరిపురపు సురేందర్, సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్, హరి పాల్గొన్నారు.



