సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేనంటే నేను అని గ్రామాలలో ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సర్పంచిగా పోటీ చేసేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంఘటన కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కోదాడ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. స్వస్థలం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. పుట్టిన ఊరికి సేవ చేయడమే లక్ష్యంగా ఇంకా 5 నెలల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నట్లు వెల్లడించారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుడిబండలో మొత్తం జనాభా 4,486. ఓటర్లు 3,813. వార్డులు 12 కలవు. ఆదివారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. దానిని దృష్టిలో పెట్టుకొని తన పదవికి రాజీనామా చేసి సొంత గ్రామానికి సేవ చేయడానికి బయలుదేరుతున్న ఆ వ్యక్తి పయనం ఎలా ఉంటదో వేచి చూడాల్సిందే?



