గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశం
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఆదివారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాస గృహములో నిర్వహించారు. గుడిబండ గ్రామపంచాయతీ ఎస్సీ మహిళ రిజర్వేషన్ కావడంతో అభ్యర్థిని ఎంపిక చేయటం కోసం అభ్యర్థిగా నిలబడి వారు,నాయకులు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ గా పోటీ చేయటానికి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు ముఖ్యంగా కోదాడ పట్టణ ఎస్సైగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్సై పులి వెంకటేశ్వర్లు తన భార్యను సర్పంచిగా ఎన్నికల బరిలో నిలిపేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అలాగే పులి శ్రీను, పులి తిరుపతి బాబు మందుల నాగయ్య నిలబడేందుకు తమ పేర్లను సమావేశంలో తెలియజేశారు అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఎస్సీ కులస్తుల నుండి సమన్వయ కమిటీని నియమించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి, ఇర్ల నాగిరెడ్డి, పింగళి వెంకటేశ్వర రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు హసన్ హలీ, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



