రెబల్ కాంగ్రెస్ అభ్యర్థి బల్గూరి స్నేహ గణపవరంలో రాకెట్ స్పీడ్ ప్రచారం
:ఫుట్ బాల్ గుర్తుతో దూకుడుగా ప్రచారం
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 06: గణపవరం ఇప్పుడు ఒక్కటే గర్జిస్తోంది స్నేహ వచ్చిందంటే గణపవరం మారిపోతుంది! దేశంలోనే నంబర్-1 స్మార్ట్ విలేజ్ అవుతుంది! కాంగ్రెస్ రెబల్ సర్పంచ్ అభ్యర్థి ఫుట్ బాల్ బల్గూరి స్నేహ ప్రచారం రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది!
విద్య ఉపాధి ఆరోగ్యం టెక్నాలజీ – ఈ నాలుగు బూస్టర్లతో గణపవరాన్ని ప్రపంచ స్థాయి మోడల్ గ్రామంగా మార్చే మహా రెవల్యూషన్ ఇప్పుడే మొదలైంది.1992-93 టెన్త్ బ్యాచ్ సూపర్ హీరో టీమ్ తమ జేబు నుంచి డబ్బులు వెచ్చించి, స్వచ్ఛందంగా ప్రచార యుద్ధాన్ని నడిపిస్తోంది. ఇదే బ్యాచ్ ఇప్పటికే 450 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వరవర రంగనాయకస్వామి దేవాలయానికి 14 లక్షలతో అద్భుత ముఖద్వారం కడుతోంది. ఇప్పుడు వారి ఒక్కటే గోల స్నేహను సర్పంచ్ చేసి… గణపవరాన్ని భారతదేశానికే ఆదర్శంగా నిలపాలి. కులం కాదు, మతం కాదు, పార్టీ కాదు – గణపవరం మొత్తం ఒక్కటైంది!
యువత గర్జిస్తోంది –
ఊరు మార్పే మా దేయం!
మీ వెంట మేముంటాం… మీరు గెలిపించండి, మేము చరిత్ర రాస్తాం అంటున్నారు.
**స్నేహ గర్జన – గుండెల్ని దడ పుట్టిస్తోంది!**
11 ఏళ్లుగా ఆస్క్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా పాలిటెక్నిక్, టీఎస్ఆర్జెసి కోచింగ్ ఇచ్చి పేద-మధ్యతరగతి పిల్లలకు స్టేట్ ర్యాంకులు తెచ్చాను.
ఇప్పుడు మన గణపవరం పిల్లలు సి ప్లస్ ప్లస్ పైతాన్, ఏఐ, రోబోటిక్స్ నేర్చుకుని గూగుల్, ఇస్రో, మైక్రోసాఫ్ట్ లో జాబులు సాధించాలి.
*నన్ను గెలిపిస్తే*
ప్రభుత్వ పాఠశాలలు → సూపర్ డిజిటల్ + కోడింగ్ ల్యాబ్స్
రోజూ ఉచిత ఆఫ్‌లైన్ + ఆన్‌లైన్ టెక్ క్లాసులు
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు + యువతకు స్టార్టప్ ఫండ్
గణపవరం → దేశానికే నంబర్-1 మోడల్ విలేజ్… ఇది హామీ కాదు, నా గ్యారంటీ!”
3600 మంది ఓటర్లు, 12 వార్డు మెంబర్లు – ఈసారి గెలుపు కాదు, గణపవరం చరిత్ర సృష్టిస్తోంది.
*ప్రచార బరిలో దూసుకొస్తున్న యువ హీరోలు*
సానికొమ్ము తరుణ్ కుమార్ రెడ్డి, శాంకురి గురవయ్య, గాయం కరుణాకర్ రెడ్డి, పొశం కృష్ణయ్య, అంచురి చెన్నారెడ్డి, అమరబోయిన లక్ష్మయ్య, దనమూర్తి, జానీ పాషా, శ్రీనివాస చారి, ముసిని శ్రీనివాస్ ఫుట్ బాల్ గుర్తుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.



