11వ వార్డులో ముమ్మర ప్రచారం
:గుర్తు గుర్తుంచుకోండి ఫుట్ బాల్ గుర్తుంచుకోండి
:గణపవరం స్వతంత్ర అభ్యర్థి బల్గూరి స్నేహ
:ఫుట్ బాల్ గుర్తుపై ఓటేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కండి.
:ఫుట్ బాల్ లా దూసుకుపోతున్న ప్రచారం.
:విద్యావంతురాలని నన్ను గెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
: సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి బలుగూరి స్నేహ
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్): విద్యావంతురాలను అయినా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గణపవరం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బల్గూరి స్నేహ అన్నారు. మంగళవారం 11వ వార్డులో వార్డు మెంబర్ ముసిని స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ విద్యావంతురాలని ఆయన నేను గణపవరం గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా ఫుట్ బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలను విద్యావంతులు మేధావులు పెద్దలు సహకారంతో చర్చించి సమస్యలను తీర్చుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

11వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారంలో మంచి స్పందన ఉన్నదని ముఖ్యంగా యువత యువతరం నాయకత్వం వైపు ముగ్గు చూపుతుందని గుర్తు చేశారు. కావున గణపవరం విద్యావంతులు మేధావులు ప్రజలు యువత ప్రతి ఒక్కరు ఫుట్ బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఇర్ల శ్రీనివాసరెడ్డి, బండి చిన్న కోటయ్య, అమరబోయిన లక్ష్మయ్య యాదవ్, చామకూరి గురువయ్య, సానికొమ్ము తరుణ్ రెడ్డి, కొండా ధనమూర్తి, గాయం రవీందర్ రెడ్డి, పిడమర్తి సూర్యనారాయణ, సామ్రాజ్యం, అసానమ్మ, కుమారి, రాఏలు, తిరపతమ్మ, సంతోషం, వజ్రమ్మ, లచ్చమ్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు



