వైష్ణవి డైరీ పాలను కోదాడ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 15 (ప్రతినిధి మాతంగి సురేష్): వైష్ణవి డైరీ పాలను కోదాడ నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం క్రాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన డైరీని సీనియర్ వైద్యులు డాక్టర్ సుబ్బారావు తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం దినదినం అభివృద్ధి చెందుతున్న తరుణంలో మంచి మంచి డైరీ కంపెనీలు రావడం శుభ పరిణామం అని అన్నారు. ఈ డైరీ కంపెనీలు ప్రజలకు మెరుగైన పాలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ సుబ్బారావు, టిపిసిసి డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఎర్నేని బాబు, డైరీ పార్లర్ యాజమాన్యం అక్కినపల్లి రామారావు, బులియంట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు సుందరి వెంకటేశ్వర్లు, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



