గోల్ సాధించిన ఫుట్ బాల్
:అత్యధిక మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి బల్గూరి స్నేహ దుర్గయ్య ఘనవిజయం
:విద్యావంతులు, యువత గ్రామ అభివృద్ధి వైపే అడుగులు
:నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన గణపవరం విద్యావంతులు, మేధావులు, యువత, ప్రజలకు ధన్యవాదాలు.
:గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళతా
:గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 15 (ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గణపవరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బల్గూరి స్నేహ దుర్గయ్య పోటీలో ఉన్న నాటి నుండి నేటి వరకు ఉత్కంఠ భరితంగానే ఉన్న సంఘటన తెలిసింది. ఎట్టకేలకు స్వతంత్ర అభ్యర్థికి గ్రామ విద్యావంతులు మేధావులు ప్రజలు పట్టం కట్టారు. 1992-93 పదవ తరగతి బ్యాచ్ మొదటినుండి స్నేహకు అండగా ఉంటూ స్వతహాగా వారి ఖర్చులను వారి ఖర్చు పెట్టుకుంటూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించి విజయానికి ముందడుగు వేశారు. ఈ టెన్త్ బ్యాచ్ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన సంఘటనలను ప్రజలకు తెలియజేయడం వలన వారిలో స్వతంత్ర అభ్యర్థి బలంగా నాటుక పోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బల్గూరి స్నేహ దుర్గయ్య గెలుపుకై నిరంతరం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు . గ్రామంలో విద్యావంతురాలను, సేవ కార్యక్రమాలలో నేను సైతం అంటూ ముందు ఉండటంవలనే ఈరోజు నా గెలుపు కు మలుపుల బాట వేసినారని గుర్తు చేశారు. గ్రామంలో మొత్తం 3200 మంది ఓటర్లు ఉండగా 12 మంది వార్డు నెంబర్లకు 6 నెంబర్లు మాకు రాగా ప్రత్యర్థులకు ఆరు మెంబర్లు గెలిచారు. నన్ను 250 ఓట్ల మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు నిరంతరము రుణపడి ఉంటానని అన్నారు. గణపవరం గ్రామంలో 450 సంవత్సరాల చరిత్ర గల వరవర రంగనాయక స్వామి దేవాలయం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద దేవాలయం కలదు రాష్ట్రంలోనే గణపవరం గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని గుర్తు చేశారు. ఈ దేవాలయానికి ముఖద్వారాన్ని 10 వ తరగతి బ్యాచ్ వాళ్ళము 14 లక్షలు కలెక్ట్ చేసి ఈ ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ ద్వారం త్వరగా పూర్తయ్యేందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని గుర్తు చేశారు.
*గ్రామంలో యువత అదే పై చేయి*
: విద్యావేత్త సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండి నడిపించే బల్గూరి స్నేహ దుర్గయ్యను గెలిపించుకోవడానికి మా ప్రయత్నాలు వృధా కాకుండా మాకు సహకరించిన విద్యావంతులకు, మేధావులకు, యువతకు, గ్రామ ప్రజలకు, ధన్యవాదాలు తెలిపారు. కుల మతాలకతీతంగా మాకు సహకరించిన గ్రామ ప్రజలను నిరంతరం గుర్తుంచుకుంటామని వారి యొక్క ఆహాభావాన్ని వ్యక్తపరిచారు.
*గ్రామ సర్పంచ్ స్నేహ దుర్గయ్య*

విద్యావంతురాలుని అయినా నన్ను గ్రామ విద్యావంతులు, మేధావులు, యువత, ప్రజలు, 1992-93 పదవ తరగతి బ్యాచ్ కులమతాలకు అతీతంగా నా గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అందరి సహాయ సహకారాలతో ముందుకు సాగుతానని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి విద్యను ముందుకు పోతానని అన్నారు. గ్రామంలో విద్య, ఉపాధి, ఆరోగ్యం వైపు ముందుకు అడుగులు వేస్తానని అన్నారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.



