మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బ్యాగులు, పెన్నులు ప్యాడ్లు పంపిణీ
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 20( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గణపవరం గ్రామంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా వైయస్సార్ యూత్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి 150 స్కూల్ బ్యాగులు, ఫ్యాడ్లు, పెన్నులు విద్యార్థులకి భోజనం సౌకర్యాలను ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య పాల్గొని విద్యార్థులకు బ్యాగులు, ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యూత్ సభ్యులను అభినందించారు. గ్రామంలో విద్యను బలోపేతం చేయడానికి యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి చినకోటయ్య, ఆదిరెడ్డి, పిడమర్తి కరుణ ఉపేందర్, కాసాని శ్రీను, కాసాని సత్యం, గడ్డం రామిరెడ్డి, చెన్నారెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, గౌతమ్ రెడ్డి,విజయమ్మ, పుష్ప, గోవర్ధన్ రెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సామ్రాజ్యం, సంతోషం, ఆసానమ్మ, సంధ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.



