కోదాడ లో రేపు గొర్రెలు మేకల్లో సామూహిక ఉచిత నట్టల నివారణ ప్రారంభోత్సవం
:అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి పెంటయ్య
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): ప్రభుత్వం ఏర్పడ్డాక జీవాల పెంపకం దారులకు చేయూతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, తొలి కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి గొర్రెలు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు తాగించే కార్యక్రమం తేదీ 22.12.2025 నుండి 31-12-2025 వరకు గ్రామ గ్రామాన పండుగ వాతావరణం లో నిర్వహించబడుతుంది. సూర్యాపేట జిల్లాలో ఇట్టి ఉచిత సామూహిక నట్టల నివారణ ఉత్సవ కార్యక్రమాన్ని కోదాడ పట్టణం లోని ప్రాంతీయ పశువైద్యశాలలో జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా డి శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. కోదాడ పట్టణంలోని గొర్రెలు మేకల పెంపకం దారులు తమ జీవాలను రేపు అనగా సోమవారం ఉదయం 8.30 గంటలకు పశువైద్యశాలకు తీసుకు వచ్చి నట్టల నివారణ మందులను త్రాగించికోవలసినదిగా అసిస్టెంట్ డైరెక్టర్ తెలియజేశారు. పశు ఔషధ బ్యాంక్ నకు విలువైన పశు ఔషధాల విరాళం చలిమెల్ల వెంకట లక్ష్మారెడ్డి నీటిపారుదల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ అయిదు వేల రూపాయల విలువైన పశు ఔషధాలు పశుపోషకుల ఉపయోగార్థం పశు ఔషధ బ్యాంక్ నకు అందజేయడం జరిగింది.



