ఎర్రవరం గ్రామ సర్పంచి గా ప్రమాణ స్వీకారం రావుల భవాని వెంకటేశ్వర్లు.
:గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా.
:గ్రామ అభివృద్ధి కోసం ఐక్యమత్యంగా పని చేద్దాం.
:గ్రామ సర్పంచ్ రావుల భవాని వెంకటేశ్వర్లు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్):గ్రామ సర్పంచిగా సోమవారం ఎర్రవరం కాంగ్రెస్ పార్టీ రావుల భవాని వెంకటేశ్వర్లు గ్రామపంచాయతీ నందు ప్రత్యేక అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టి సర్పంచిగా బాధ్యతలను తీసుకోవడం జరిగింది. అనంతరం వారితో పాటు వార్డ్ మెంబర్స్ లు ప్రమాణ స్వీకారం నిర్వహించి సంతకాలు పెట్టి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికై ఐక్యమత్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని, గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని, గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సర్పంచి, వార్డ్ మెంబర్స్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



