వినూతన రీతిలో ప్రమాణ స్వీకారానికి వచ్చిన గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య
:మహనీయుల అడుగుజాడల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
:గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుగా
:గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): మహనీయుల ఆశయాలతో ముందుకు సాగుతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గ్రామ ప్రజలంతా పండగలా మేళ్ల తాళాలు, భాజాభజంత్రీలతో పూజారి ఆశీర్వవచనాలతో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారిచే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం బుద్ధుని, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసినారు. అనంతరం ఏర్పాటుచేసిన సన్మానోత్సవ సభలో సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ గ్రామంలో విద్యావంతులు, మేధావులు, పెద్దలు, పాలకమండలి తో కలిసి గ్రామంలో సమస్యలను వెలికి తీసి ఆ సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి, గ్రామ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పదవ తరగతి బ్యాచ్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు



