గొర్రెలు మేకల పెంపకందారులకు కొండంత అండగా తెలంగాణ ప్రభుత్వం
:గొర్రెల నట్టల మందును గొర్ల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాల.
:గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య.
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గొర్రెల నట్టల మందును గొర్ల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో గడ్డం మొగిలి ఇంటి వద్ద ప్రాంతీయ పశువైద్యశాల డాక్టర్ దుగ్యాల శేషగిరి బృందం చె గొర్రెలు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను త్రాగించే కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంబించినారు. ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో మొక్క నాటి పరిపాలన ప్రారంభించారు.

అనంతరం గ్రామంలో నర్సరీలను పరిశీలించారు పాఠశాలలో మధ్యాహ్న భోజన అన్నాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనము అందించాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గొర్రెల పెంపకం దారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి నాలుగు దఫాలు జీవాల పెంపకం దారులు తమ జీవాలకు నట్టల వేస్తారు కావున గొర్ల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు డబ్బులకు మందులు కొనుక్కొచ్చి నష్టపోవద్దని ప్రభుత్వం అందించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.



