శీలం కమలాకర్ మరణం అ కుటుంబానికి తీరని లోటు
కానిస్టేబుల్ శీలం కమలాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుడిబండ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ కుటుంబ సభ్యులైనా తల్లి,సోదరి లకు మానవత్వ దృక్పథం తో గుడిబండ గ్రామంలోనీ పోలీసు శాఖ చెందిన వివిధ హోదాలలో ఉన్నటు వంటి అధికారులు 65000/ – ల నగదును గ్రామ మొట్ట మొదటి యస్ఐ ( రిటైర్డ్ ) పులి వెంకటేశ్వర్లు, ప్రసన్నకుమారి,షేక్ మదర్ సాబ్,కాలేతిర్పి తిరుపయ్య, ఊదర వెంకటరత్నం ల ద్వారా సోమవారం అందజేసినారు. ఈ సందర్భం గా పులి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామములోనీ పోలీసుడిపార్ట్మెంట్ వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆపద, అవసరం ఉన్న ఎల్లావెళ్ళా గ్రామ పోలీసు అధికారులు అందరూ కలిసి కట్టుగా ఉండి సేవ చేయాలని పిలుపు నిచ్చారు. కమలాకర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిడిపార్ట్మెంట్ పరంగా రావలసిన బెనిఫిట్స్ ను త్వరగా వచ్చేటట్లు జిల్లా ఎస్పీ నీ కలిసి తనవంతు గా కుటుంబ పరిస్థితి తెలియజేస్తానని చెప్పినారు. ఈ నగదు ను ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలిపినారు.



