సిఎస్ఐ క్రైస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు….
:క్రీస్తు దీవెనలు అందరికీ కలగాలి: రెవ, పాల్.
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 25( ప్రతినిధి మాతంగి సురేష్): లోకకల్యాణం కోసం జన్మించిన యేసుక్రీస్తు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవ, పాల్ అన్నారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని గురువారం కోదాడ గాంధీనగర్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్యహించారు. తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చికి చేరుకుని దైవారాధనలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ సందేశం ప్రపంచమంతా విస్తరించాలని, ఆయన దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, టీపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కందుల కోటేశ్వరరావు, గంధం యాదగిరి, నెమ్మది ప్రకాష్ బాబు దేవమణి, కాసర్ల సత్యవతి, గ్రూప్ అండ్ ఫాస్ట్రేట్ సెక్రెటరీ నెమ్మది నవీన్, ట్రెజరర్ ఏర్పుల యాకోబ్, బాలేముల వెంకన్న, యూత్ సెక్రెటరీ సోమపంగు నవీన్, సండే స్కూల్ సెక్రెటరీ కర్ల ప్రవీణ్, స్త్రీల మైత్రి వారు కమిటీ మెంబర్లు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



